ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
18-10-2026 | 05:01pm
నిజాంసాగర్ అక్టోబర్ 18( విజయక్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పూలను పూజించే సంస్కృతి, సాంప్రదాయబద్ధంగా(Cultural and traditional) నిర్వహించే బతుకమ్మ వేడుకలు కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని(Nizamsagar Mandal) గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ఘనంగా జరుపుకున్నారు. అందంగా అలంకరించిన బతుకమ్మతో గ్రామాల్లో కోలాటం, దాండియా నృత్యాలతో బతుకమ్మ సంబరాలు, ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు.