సంపద పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

09-10-2026 | 09:53pm

తాడ్వాయి,అక్టోబర్,09 ( విజయ క్రాంతి ): కోపరేటివ్ బ్యాంకు(Cooperative Bank) అందించే సంపద పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాడ్వాయి కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ కుమార్ స్వామి(Tadwai Co-operative Bank Manager Kumar Swamy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆయన శుక్రవారం మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు(Farmers), ప్రజల కోసం తమ బ్యాంకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు.ఇందులో ప్రజలు తమ డబ్బులు డిపాజిట్ చేస్తే అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్(Rate of interest) లభిస్తుందన్నారు.

రైతులు ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ పథకంలో 555 రోజులు డిపాజిట్ ఉంచాలని ఆయన సూచించారు. డబ్బుల డిపాజిట్ లో సీనియర్ సిటిజన్(Senior Citizen) లకు రేట్ అఫ్ ఇంట్రెస్ట్ మరికొంత ఎక్కువగా లభిస్తుందని తెలిపారు. ఈ బ్యాంకు పరిధిలో మొత్తం రూ.12 కోట్ల పంట రుణాలు రైతులకు అందించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక రుణాలు రూ. 2 కోట్లు అందించినట్లు తెలిపారు.రైతులు సకాలంలో పంట రుణాలు, దీర్ఘకాలికరణాలు చెల్లించుకోవాలని ఆయన సూచించారు. సకాలంలో రైతులు రుణాలు చెల్లిస్తే ఎక్కువ మంది రైతులకు రుణాలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు