భాష జాతీయ చైతన్యానికి ఆత్మ
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్
- ఘనంగా జాతీయ హిందీ దినోత్సవం
కామారెడ్డి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): భాష కేవలం సంస్కృతి, సాంప్రదాయాలు, జాతీయ చైతన్యానికి ఆత్మ అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Government Degree College) ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ అన్నారు.హిందీ భాష వినియోగం పెంచడం, హిందీ భాషలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నిర్వహించే హిందీ దినోత్సవాన్ని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో శనివారం హిందీ విభాగం ఆధ్వర్యంలో ‘జాతీయ హిందీ దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ జాతీయ భాష అయిన హిందీలో సంభాషించే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యత, సంస్కృతి, జ్ఞాన సమృద్ధి’ అనే అంశంపై విస్తృతంగా విశదీకరించారు. నేటి ఆధునిక ప్రపంచంలో భాషల సమ్మేళనం ఎంత అవసరమో ఆయన వివరించారు.
కళాశాల హిందీ విభాగాధిపతి డాక్టర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ భాషా వేదికపై హిందీ అత్యంత బలమైన స్థానాన్ని కలిగి ఉందని, కోట్లాది మంది ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారని అన్నారు. ప్రస్తుత గ్లోబల్ యుగంలో హిందీ భాష అనేక ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తోంది. అనువాదకులుగా , జర్నలిజంలో, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్, అబ్బ్రాడ్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ రంగాలలో హిందీ ప్రావీణ్యం ఉన్న వారికి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
అయితే,యువత పట్టుదలతో అభ్యసిస్తే హిందీ ఉపాధి రంగానికి ఒక గొప్ప వారధిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె. కిష్టయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. విశ్వప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్, సోషల్ సైన్స్ డీన్ డాక్టర్ సుధాకర్, లైఫ్ సైన్స్ డీన్ డాక్టర్ దినకర్ చిన్న, హిందీ అధ్యాపకులు డాక్టర్ బాలాజీ, డాక్టర్ రమేష్తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.