జిల్లాస్థాయి పాఠశాల చదరంగం పోటీలు

11-10-2026 | 10:21pm

కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : గజ్వేల్ చెస్ అకాడమీ(Gajwel Chess Academy) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా స్థాయి చదరంగం పోటీలు(Chess tournaments)  ఆదివారం  ఎస్ పి ఆర్ హై స్కూల్(SPR High School) కామారెడ్డి లో  నిర్వహించారు.  విద్యార్థులలో ఉన్న  మేధాశక్తిని వెలికి తీయడానికి చెస్ పోటీలు ఎంతో దోహదపడతాయని జిల్లా యువజన సంక్షేమ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్, డాక్టర్ కె పి అనిల్ కుమార్ లు తెలిపారు. ఎస్ పి ఆర్ పాఠశాల కరస్పాండెంట్ కొమిరెడ్డి మారుతి సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలలో  60 మంది విద్యార్థుల నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పదిమంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన విద్యార్థుల కు షీల్డ్, మెడల్స్, సర్టిఫికెట్స్ తో  సత్కరించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థుల డి.ధనుష్,వై.హరి ఓం,ఎస్. మని తేజ, ఏ. అన్వేష్,ఎస్.మణికంఠ,ఎస్.కె మహమ్మద్ అబేద్, కె రిషికేష్, టి శ్రేయస్,ఎల్ లాస్య,పి నవనీత్ రెడ్డి, లను ఎంపిక చేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ కొమిరెడ్డి మారుతి తెలిపారు.

మరిన్ని వార్తలు