ప్రభుత్వం విలేకరుల సమస్యలు పరిష్కరించాలి
తాడ్వాయి,నవంబర్,24( విజయ క్రాంతి ): ప్రభుత్వం(Government) విలేకరుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావుకు(MLA K. Madan Mohan Rao) విలేకరులు వినతిపత్రం అందించారు.కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో విలేకరులు పెన్ను,పన్ను పింఛన్ కార్యక్రమంలో భాగంగా విలేకరులకు ప్రభుత్వం బాసటగా నిలవాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి విలేకరి వయసు అయిపోయిన తర్వాత పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. విలేకరులు ఏదైనా అనారోగ్యంతో బాధపడిన వారికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి విలేఖరికి వారి వారి ప్రాంతాలలో ఇల్లు నిర్మించి ఆవాసం ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వం వివిధ పత్రికలకు ఇస్తున్న యాడ్సులలో 10 శాతం మినహాయించుకొని ప్రత్యేకంగా విలేకరులకు నిధి ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న విలేకరులకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఎన్నో సంవత్సరాల నుంచి తన వృత్తిని నమ్ముకుని విలేకరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో విలేకరులు నడిపి రాజ్ కుమార్,గాండ్ల మల్లేష్, పాగల సాయిబాబా, జాదవ్ నవీన్ రావు, సంగేపు మురళి, తదితరులు పాల్గొన్నారు.