ఇబ్రహీంపేట్ గ్రంథాలయానికి రూ.12 వేల విలువైన పుస్తకాలు అందజేత..
27-10-2026 | 06:47pm
బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలోని గ్రంథాలయానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు సుమారు రూ.12 వేల విలువైన 60 పుస్తకాలను మంగళవారం గ్రామ సర్పంచ్ సంధ్య రాజ్‌కుమార్ కు లైబ్రేరియన్ సుధాకర్ అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు విద్యార్థులు, యువతకు విజ్ఞానాన్ని అందించడంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, గొల్ల రమేష్, కరీం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.