ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

03-11-2026 | 03:57pm

అర్హులైన పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం...

బాన్సువాడ, నవంబర్ 3 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారు సిద్ధంవార్ దుర్గవ్వ, పాపయ్య ఇంటి నిర్మాణానికి ఆయన భూమిపూజ నిర్వహించి, నిర్మాణ అనుమతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగారం, వార్డు సభ్యులు కాజా నవాజ్ ఖాన్, జూనియర్ అసిస్టెంట్ హనుమంతరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, శంకర్, విజయ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు