ఒకే బావి.. 15 మోటార్లు... 45 గృహాలకు తాగునీరు సరఫరా

03-11-2026 | 04:40pm

తాగునీటి బావిలో నాచు....

ఉట్నూర్, నవంబర్ 03 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా(Adilabad district) సిరికొండ మండలంలోని కన్నాపూర్ పంచాయతీ కేంద్రం కన్నాపూర్ గ్రామానికి మిషన్ భగీరథ నీరు అప్పుడప్పుడు సరఫరా అవుతుంది. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి... 1989లో మండల ప్రజా పరిషత్  నిధులతో నిర్మించిన తాగునీటి బావిలో 45 గిరిజన కుటుంబాల వారు 15 మోటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి  తాగునీరును తీసుకుంటున్నారు.

గూడెం గిరిజనులు తాగే  తాగునీరు స్వచ్ఛమైందే అనుకుంటే పొరపాటే.. తాగునీటి బావిలో చేరిన నాచుతో తాగునీరు కలుషితమవుతుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు పట్టించుకోకుండా నిత్యం తాగునీరును మోటారు ద్వారా తీసుకుంటున్నారు. తాగునీటిని గ్రామపంచాయతీ కార్యదర్శి గాని, సర్పంచ్ గాని నాచు తొలగించే విషయంలో వారు శ్రద్ధ చూపడం లేదని ఈ చిత్రాలి నిదర్శనం... ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి గ్రామ గిరిజనులు స్వచ్ఛమైన తాగునీరు తాగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు