విద్యార్థుల భవిష్యత్తే గ్రామ భవిష్యత్తు
బెజ్జంకి,(విజయక్రాంతి): మండలంలోని గూడెం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government Primary School) విద్యార్థులకు షూస్, సాక్సులు, బెల్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గ్రామ అభివృద్ధితో పాటు విద్యాభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తామని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తామని తెలిపారు. నాణ్యమైన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయురాలు రేవతి, ఉపసర్పంచ్ యాలల పరశురాములు, ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.