ఉద్యోగుల సమ్మెకు ఐఎన్టీయూసీ సంఘీభావం
నిర్మల్, నవంబర్ 03 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గత 22 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల 3194 ఐఎన్టీయూసీ యూనియన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్(INTUC Union President Krishna Mohan Goud) మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
అలాంటి ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని 22 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగుల సమస్యలను ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు వారికి అండగా నిలుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి సాయమ్మ తదితరులు పాల్గొన్నారు