ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడో?

22-10-2026 | 04:22pm

ఎదురుచూస్తున్న రైతులు

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 22 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద,తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(Primary Agricultural Cooperative Societies) ఆధ్వర్యంలో మరియు ఐకెపి ఆధ్వర్యంలో ఖరీఫ్ వరి పంట కొనుగోలు కేంద్రాలు ముహూర్తాలు ప్రారంభించారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ముహూర్తాలు ప్రారంభించి సుమారు 20 రోజులకు పైగా అవుతుందని ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు (కాంటలు) కొనసాగడం లేదని రైతులు వాపోతున్నారు.

కొనుగోలు కేంద్రాలు కాంటలు ఎప్పుడు ప్రారంభిస్తారో అని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏ,,గ్రేడ్ వరి ధాన్యం 2461,సాధారణ రకం వరి ధాన్యం 2441 ధర నిర్ధారణ చేసింది.కానీ ఇప్పటివరకు 20 రోజులకు పైగా అవుతుందని కానీ కొనుగోలు కేంద్రాలు (కాంటలు) ప్రారంభం కావడం లేదని రైతులు అయోమయంలో ఉన్నారు.

కొంతమంది రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ధాన్యాన్ని విక్రయించడంతో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేస్తుందో లేదోనని ఆలోచనల పడ్డారు.ప్రారంభించినటువంటి ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (కాంటలు) ప్రారంభించి ధాన్యాన్ని విక్రయించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు