ప్రజావాణికి అధికారులు సమయపాలనతో హాజరు కావాలి
ఎంపీడీవో మధురిమ
దోమకొండ, నవంబర్ 1 (విజయక్రాంతి): దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీడీవో మధురిమ(MPDO Madhurima) తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.