ఓటు హక్కుపై బీజేపీ కుట్ర..
* సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలి
* ఏఐఎస్ఎఫ్ డిమాండ్
కోహెడ, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యానికి పునాదైన ఓటు హక్కును బీజేపీ ప్రభుత్వం కాలరాస్తూ.. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగింపునకు కుట్ర పన్నిందని ఏఐఎస్ఎఫ్ కోహెడ మండల కార్యదర్శి రాసురి యుగేందర్(AISF Koheda Mandal Secretary Rasuri Yugender) విమర్శించారు. ఆదివారం కోహెడలో ఏఐఎస్ఎఫ్ నాయకులతో కలిసి జ్ఞానేశ్ కుమార్ ను అరెస్ట్ చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏరివేసి రాజకీయ లబ్ధి పొందాలన్నదే బీజేపీ లక్ష్యం అన్నారు.
ఓట్లు తొలగింపునకు బాధ్యుడైన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి ఓటు చోరీపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కల్పించిన సమానత్వ హక్కును, ఆర్టికల్ 326 ద్వారా లభించిన ఓటు హక్కును ఎస్ఐఆర్ ప్రక్రియ దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో AISF నాయకులు చిట్యాల శేఖర్, కందుకూరి మహేష్, ఎర్ర శ్రీనివాస్, చిట్యాల రాజు, మహేష్, భాస్కర్ పాల్గొన్నారు.