చర్లగూడెం రిజర్వాయర్ పనులు వెంటనే పూర్తి చేయాలి

01-11-2026 | 11:41pm

- రాచకొండ ఎత్తిపోతల పథకంతో 44,567 ఎకరాలకు సాగునీరు అందించాలి

- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

మునుగోడు, నవంబర్ 1 (విజయక్రాంతి): చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Former MLA Julakanti Rangareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాచకొండ సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లోని 44,567 ఎకరాలకు సాగునీరు అందించాలని కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల మహా పాదయాత్రను మర్రిగూడ మండలం శివన్నగూడెం ప్రాజెక్టు వద్ద ఆయన ప్రారంభించారు.

మునుగోడు, దేవరకొండ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.నవంబర్ 1 నుంచి 3 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, చివరి రోజు చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. జహంగీర్, తుమ్మల వీరారెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, దోనూరు నర్సిరెడ్డి, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సురకంటి శ్రీనివాస్ రెడ్డి, దొంతగోని పెద్దులు, చాపల మారయ్య, దోడ యాదగిరిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, శ్రీనివాసచారి, ఏర్పుల యాదయ్య, నాంపల్లి చంద్రమౌళి, సాగర్ల మల్లేష్ ఉన్నారు.

మరిన్ని వార్తలు