ఓట్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్
01-11-2026 | 11:48pm
ఆలేరు, నవంబర్ 1 (విజయక్రాంతి): ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో భువనగిరి పట్టణ 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్(Jaligam Vignesh) పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటంపై నిర్వహించిన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, దాని పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు.