భక్తులకు కోసం ఉచిత పాదరక్షల స్టాండ్ ఏర్పాటు
పాలకమండలి తీర్మానంపై భక్తుల హర్షం..
యాదగిరిగుట్ట, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఉదయం నుండి భక్తుల సౌకర్యార్థం ఉచిత పాదరక్షలు భద్రపరచు స్టాండును దేవస్థానం పాలకమండలి ఆదేశాల మేరకు దేవస్థానం ఏర్పాటు చేసింది. గతంలో పాదరక్షలు భద్రపరిచే స్టాండుకు టెండర్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో భక్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని పాలకమండలి సభ్యులు దృష్టికి రాగా ఇబ్బందుల నుండి అధిగమించేందుకు ఉచిత పాదరక్షలు భద్రపరిచే కౌంటర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది.
ధర్మకర్తల చైర్మన్, పాలకమండలి సభ్యుల తీర్మానము ననుసరించి యాదాద్రి-భువనగిరి కలక్టరు, అధనపు కలక్టరు స్థానిక సంస్థల వారిని సంప్రదించుట జరిగినది. వారి సూచనల మేరకు జిల్లా కలక్టరేట్ ఆద్వర్యంలో గల మెప్మా ద్వారా యాదగిరిగుట్ట పట్టణ మహిళా సంఘంముల వారిచే ఉచితముగా పాదరక్షలు భద్రపరచు కౌంటర్స్ ప్రారంభించారు. ఉచిత పాదరక్షల స్టాండ్ ను ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.