ఓటు బచావో-దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొన్న మండల సీనియర్ నాయకులు

01-11-2026 | 11:25pm

నాగిరెడ్డిపేట్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆధ్వర్యంలో రాంలీల మైదానంలో చేపట్టినటువంటి ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమంలో ఎల్లారెడ్డి ముద్దుబిడ్డ శాసనసభ్యులు మదన్ మోహన్ రావుతో కలిసి ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండల సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ విట్టల్రెడ్డిగారి విట్టల్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానష్ కుమార్ రాజీనామా చేసేదాకా కాంగ్రెస్ పార్టీ ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు.

అలాగే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమని దాని తర్వాత అజ్ఞానేష్ కుమార్ని జైలుకు పంపించడం జరుగుతుందని వివరించారు. ప్రజలు కూడా బిజెపి చేసినటువంటి దగాని గుర్తించాలని, అలాగే దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉండాలని, ఈ సందర్భంగా దేశప్రజానీకానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు