శనగ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి

09-10-2026 | 08:38pm

తాడ్వాయి,అక్టోబర్,09( విజయక్రాంతి ): రైతులు శనగ విత్తనాలు(Farmers Bengal gram seeds) సద్వినియోగం చేసుకోవాలని దేమి కలాన్ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు వెంక రెడ్డి(Enugu Venka Reddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడువాయి మండలం దేమికలాన్ సింగిల్ విండోలో శుక్రవారం ఆయన రైతులకు శనగ విత్తనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన.మాట్లాడుతూ.... యాసంగిలో అవసరమున్న రైతులు శనగ విత్తనాలు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కన్కల్ గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి, దేమికలాన్ గ్రామ ఉపసర్పంచ్ గంగయ్య ఇన్చార్జి సెక్రెటరీ అఖిలేష్, సిబ్బంది సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు