ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజాసేతు’

09-10-2026 | 09:48pm

వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ.. జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ప్రజా సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సేవలను(government services) ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘కె.బి. ఆసిఫాబాద్ ప్రజాసేతు’ డిజిటల్ వేదికను(Digital platform) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో(Artificial Intelligence) కూడిన ఆధునిక సాంకేతికత(Modern technology) ఆధారంగా ఈ వేదిక పనిచేస్తుందని పేర్కొన్నారు.

ప్రజలు తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మౌలిక వసతులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను వాట్సాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఫిర్యాదుతో పాటు సమస్య వివరాలు, గ్రామం లేదా వార్డు పేరు, అవసరమైతే ఫొటోలను జతచేయాలని తెలిపారు.

ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 7569986036ను సంప్రదించాలని, https://kbasifabad.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండానే సమస్యలను తెలియజేసే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే ప్రజాసేతు ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు