అంగరంగ వైభవంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు
ZPHS జానంపేట పాఠశాల
పినపాక అక్టోబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శుక్రవారం ZPHS జానంపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు K. విజయలక్ష్మి(Vijayalakshmi) ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, పూల వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను(Bathukamma Festival) పాఠశాలలో సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు(School teachers), సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చారు. బతుకమ్మ పాటలు, సంప్రదాయ వేడుకలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాటిచెప్పారు.
బతుకమ్మ అంటే పూల పండుగ మాత్రమే కాదు… ప్రకృతిని ఆరాధించే పండుగ, మహిళల ఆత్మీయతకు ప్రతీక, తెలంగాణ ఆత్మగౌరవానికి చిహ్నం, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత, సృజనాత్మకత, సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందిస్తాయని తెలియజేస్తూ, ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయురాలు K. విజయలక్ష్మి ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల సిబ్బందికి, విద్యార్థినీ, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.