ప్రశాంతంగా కార్మిక సంఘాల ఎన్నికలు..!
09-10-2026 | 11:53am
పోలీసుల భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న ఓటింగ్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ ఆర్టీసీ డిపో(Banswada RTC Depot)లో కార్మిక సంఘాల ఎన్నికల(RTC Depot Union Elections) ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి ఉదయం నుంచి తరలివస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో భద్రతను పర్యవేక్షిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు.