వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యం
వాలీబాల్ టైగర్ కప్ పోటీలు
విజేతలకు బహుమతులు, పతకాల ప్రదానం
బాన్సువాడ ఫారెస్ట్ రేంజ్ అధికారీ హబీబ్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ZPHS Government High School)లో శుక్రవారం వన్యప్రాణుల వారోత్సవాలు–2026 సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్టు రేంజ్ అధికారి హబీబ్(Forest Range Officer Habib) పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో వాలీబాల్ టైగర్ కప్ పోటీలను కూడా నిర్వహించారు.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు, పతకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.