రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు.. తొలగించే నాథుడెవరు?

19-09-2026 | 07:24pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 19 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలంలోని ఎంఎస్ ఎన్ ఫార్మా కంపెనీ (MSN Pharma Company) సమీపంలో పెద్దమల్లారెడ్డికి (Peddamalla Reddy) వెళ్లే ప్రధాన రహదారి పై శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పక్క నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. చెట్టు రోడ్డుపై పడి గంటలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు