బీఎల్‌ఓల ఎస్‌ఐఆర్‌ దరఖాస్తుల ప్రక్రియపై ఎమ్మార్వో ఝాన్సీ రాణి పరిశీలన

11-09-2026 | 05:02pm

మల్దకల్: మల్దకల్ మండల(Maldakal Mandal) కేంద్రంలో బీఎల్‌ఓల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎమ్మార్వో ఝాన్సీ రాణి(MRO Jhansi Rani) పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓలు(Booth Level Officer) నిర్వహిస్తున్న రికార్డులు, ఓటర్ల వివరాలు, సంబంధిత దరఖాస్తులను పరిశీలించి ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఎమ్మార్వో ఝాన్సీ రాణి సూచించారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు