ధర్నాను అడ్డుకునేందుకు ఆశా వర్కర్ల అరెస్టులు

07-09-2026 | 11:01pm

విధుల్లో ఉన్న వారినీ నిర్బంధించారని సీఐటీయూ ఆరోపణ

గద్వాల,(విజయక్రాంతి): హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌(Indira Park) వద్ద నిర్వహించనున్న ధర్నాకు ఆశా వర్కర్లు వెళ్లకుండా ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ జిల్లా కార్యదర్శి సునీత(Telangana ASHA Workers Union CITU District Secretary Sunitha) ఆరోపించారు. విధుల్లో ఉన్న ఆశా వర్కర్లను సైతం మధ్యలోనే అరెస్టు చేసి విధులకు దూరం చేశారని తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాన్ని అణచివేయడం సరికాదన్నారు.తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని సునీత స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు