మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): జిల్లాలో ఈ ఏడాది చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో(Projects) చేప పిల్లలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముదిరాజ్ మహాసభ(Mudiraj Mahasabha) జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్ అన్నారు. జిల్లాలో మూడు ప్రధాన రిజర్వాయర్లతో పాటు 748 చిన్న చెరువులు.
కుంటలు, 133 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 10,573 మత్స్యకార కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వర్షాభావంతో చెరువులు నిండక ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రతి ఏడాది చేప పిల్లల కోసం కేటాయించే రూ.2.15 కోట్ల నిధులను నేరుగా మత్స్య సొసైటీలకు అందించడంతో పాటు మత్స్యకార కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.