తాగునీటి కోసం మహిళల పాట్లు

29-10-2026 | 03:20pm

చెన్నూర్,( విజయక్రాంతి):మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో(Erraguntapalli Village) మహిళలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోందని వాపోయారు. తమ కాలనీలో గత ఐదు నెలలుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్పంచ్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. సర్పంచి భర్త బోరుకున్న మోటారును తీసుకెళ్లాడని మహిళలు ఆరోపించారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తమ తాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు.

మరిన్ని వార్తలు