తెలంగాణ రాజకీయాల్లో మరో హీట్
అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీలో జోష్.. భారీ పాదయాత్రకు ఏర్పాట్లు!
హైదరాబాద్: నవంబర్ 2న నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రకు పార్టీ రాష్ట్ర నాయకత్వం సన్నద్ధమవుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో ఏర్పాట్లపై Telangana BJP ప్రత్యేకంగా దృష్టి సారించింది. జన సమీకరణ, కార్యక్రమ నిర్వహణ, భద్రత, పాదయాత్ర రూట్ వంటి అంశాలపై పార్టీ నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, రాష్ట్ర సహ ఇన్ఛార్జి అభయ్ పాటిల్, పార్టీ ప్రధాన కార్యదర్శులు తదితరులు సమావేశమై కార్యాచరణపై చర్చించారు.
ఓపెన్ ప్లేస్లో కాదు.. ప్రజల మధ్యే పాదయాత్ర!
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచకతను అంతం చేద్దాం’ (Loktantra Bachao – Arajakata Hatao) నినాదంతో ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రజలకు దగ్గరగా కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో, కేవలం Open Groundలో సభ నిర్వహించడంకంటే జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రజల మధ్య నుంచి పాదయాత్ర సాగించేలా ప్రణాళిక రూపొందించాలని కేంద్ర నాయకత్వం సూచించినట్లు సమాచారం. దీంతో స్థానికంగా అనువైన ప్రాంతాలు, రూట్ ఎంపికపై పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
ఏర్పాట్లపై నేతల పరిశీలన
కార్యక్రమానికి అవసరమైన స్థలాలు, జనసమీకరణకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు బీజేపీ నాయకులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మొజంజాహీ మార్కెట్ పరిసరాలను పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి స్థానిక పరిస్థితులు, రవాణా, ప్రజల రాకపోకలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అమిత్ షా పర్యటనను విజయవంతం చేయడంతో పాటు, పాదయాత్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ పాదయాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. SIR ప్రక్రియపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తుండగా, ఓటర్ల హక్కులు, పేర్ల తొలగింపుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 2న జరగనున్న పాదయాత్ర ద్వారా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.