చాకలి ఐలమ్మ త్యాగాలు స్ఫూర్తిదాయకం
10-09-2026 | 06:26pm
రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి,(విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ(Chakali Ilamma) త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్(Revenue Additional Collector Ashok Kumar) అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అశోక్‌కుమార్, బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.