ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం

10-09-2026 | 07:59pm

ఆచార్యదేవోభవ–2026 కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

బోధన్,(విజయక్రాంతి): సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో ఆచార్య దేవోభవ–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ఇందూరు హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి పార్శి అశోక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బోధన్ మండల విద్యాశాఖ అధికారి ఏ. నాగయ్య, సాలూర మండల విద్యాశాఖ అధికారిణి రాజీ మంజూష విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ట్రస్మా ఆధ్వర్యంలో బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. సుమారు 25 పాఠశాలలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా సత్కరించి అభినందించారు.

కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిశోర్, గౌరవ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాస్ రావు, అధ్యక్షులు ముస్త్యాల హరికృష్ణ, కార్యదర్శి మంతె సురేష్, కోశాధికారి కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు మిద్దెల రాజు, డివిజన్ కార్యదర్శి అనిల్ కుమార్, డివిజన్ కోశాధికారి సురేష్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ పాఠశాలలు, కళాశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు