అక్రమ కట్టడాలు పట్టించుకోని అధికారులు

10-09-2026 | 07:36pm

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామం(shivnur village)లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునే నాథుడే కరవయ్యారు. గ్రామ శివారులో పంచాయతీ అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు(Illegal constructions) కొనసాగుతూనే ఉన్నా.. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. కొందరు తమ వ్యవసాయ క్షేత్రంలో పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే దర్జాగా, కొత్త గా ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత పంచాయతీ సెక్రటరీకి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించి అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అంటున్నారు.  పంచాయతీ సెక్రటరీ రాజు ను ఫోన్లో సంప్రదించగా గ్రామ శివార్లో గల గెస్ట్ హౌస్ లో కొత్తగా నిర్మాణం చేపట్టడం నిజమేనని, తన దృష్టికి రావడంతో అతనికి నోటీసు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పై అధికారుల ఆదేశానుసారం తగు చర్యలు చేపడతానని  వారు తెలిపారు.

మరిన్ని వార్తలు