రేవంత్ పాలనపై కేటీఆర్ ఫైర్

27-10-2026 | 06:47pm

హైదరాబాద్: తెలంగాణలో రైతులు(Farmers) ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్, యూరియా సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. నదుల్లో నీరు అందుబాటులో ఉన్నా సాగుకు వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్మల్‌కు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్‌(BRS)లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, రైతుబంధు వంటి పథకాల ద్వారా భరోసా కల్పించామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. నీటి నిర్వహణపై దృష్టి సారించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ తిరిగి అభివృద్ధి, సంక్షేమ బాటలో పయనిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు