జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం
ఐవీఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెటరన్ డాక్టర్ జి మధుసూధన రావు
కోదాడ అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్(Indian Veterans Organization) జాతీయ కార్యవర్గం సూర్యాపేట జిల్లాకు "జాతీయ ఐకానిక్ జిల్లా-2026" తెలంగాణకు "ఐవీఓ ఉత్తమ రాష్ట్రం-2026" అవార్డులు ప్రకటించింది. ఈ ప్రశంసా పత్రాన్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా కోదాడ వాసి ఐవీఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెటరన్ డాక్టర్ జి మధుసూధన రావు మంగళవారం అందుకున్నారు. 25 ఏళ్ల తర్వాత అమర జవాన్ గోపయ్యకి న్యాయం, 100 అడుగుల జాతీయ జెండా, 9 కిలోమీటర్ల ఐవీఓ రోడ్డు, 24 గంటల కాల్ సెంటర్ - ప్రభుత్వ నిధులు లేకుండా సాధించిన ఘనతకు ఈ గౌరవం దక్కిందని ఐవీఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెటరన్ డాక్టర్ జి మధుసూధన రావు తెలిపారు.