పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్
రూ.5,290 నగదు స్వాధీనం
గణపురం, నవంబర్ 02 (విజయ క్రాంతి):మండల కేంద్రంలో పేకాట స్థావరంపై గణపురం పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు. ఎస్ఐ బొరగల అశోక్(SI Boragala Ashok) ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సోమవారం పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నాగవీధికి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పేకాటకు వినియోగిస్తున్న రూ.5,290 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ.. పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ఇలాంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, పేకాట స్థావరాల సమాచారం తెలిస్తే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని సూచించారు.