మహిమాన్వితుడు గణపేశ్వరుడు

08-11-2026 | 05:20am

నాగపురి శ్రీనివాస్‌గౌడ్ :

(భూపాలపల్లి, విజయక్రాంతి) : మహిమాన్వితుడు గణపేశ్వరుడు(The Glorious Lord Ganesha) కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల(devotees) కోరిన కోర్కెలు తీర్చేందుకు కొలువు తీరనున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం కాకతీయుల కళా వైభవానికి(artistic splendor of the Kakatiyas) ప్రతీకగా నిలిచిన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Sri Bhavani Sahita Ganapeshwara Temple) కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ప్రతి సోమవారం శ్రీ గణపేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పట్టు వస్త్రాలతో అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24న కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటగుళ్ల ప్రాంగణంలో 21 వేల దీపాలతో మహా దీపోత్సవం నిర్వహించనున్నారు. వేలాది దీపాల వెలుగులతో కోటగుళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. 

ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం

కార్తీకమాసం సందర్భంగా ప్రతిరోజూ సాయంత్రం ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా, కార్తీక పురాణ పఠనం నిర్వహించనున్నారు. కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో కొనసాగించనున్నారు. కార్తీకమాసంలో ప్రత్యేకంగా నందీశ్వర అభిషేకం, సత్యనారాయణ వ్రతాలు, గోపూజ, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న కోటగుళ్లలో కార్తీకమాస వేడుకలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు