రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో గణపురం విద్యార్థుల ప్రతిభ

02-11-2026 | 11:25pm

గణపురం, నవంబర్ 02 (విజయ క్రాంతి): రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్‌లో(State-level Mock Parliament) గణపురం పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని గోదావరి హాల్‌లో తెలంగాణ రాష్ట్ర పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లో గణపురం పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు రౌతు వశిష్ట మహర్షి, గడ్డమీది వెన్నెల  పాల్గొన్నారు.

జిల్లాస్థాయిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు పార్లమెంట్‌లో అధికార పక్ష సభ్యులుగా, ప్రధానమంత్రి, ఎంపీ పాత్రల్లో సమకాలీన, సాంకేతిక అంశాలపై తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి ఉత్తమ సభ్యులుగా సర్టిఫికెట్లు పొందారు.విద్యార్థుల వెంట జిల్లా తరఫున ఉపాధ్యాయురాలు కె. మాధవి పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభపై పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు