పుస్తెలతాడు కేసును చేదించిన పోలీసులు
బైకు, పుస్తెలతాడు స్వాధీనం
ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
కొడిమ్యాల, నవంబర్ 4 (విజయక్రాంతి): జగిత్యాల(Jagtial) జిల్లా కొడిమ్యాల మండలం గంగారం తండా గ్రామానికి చెందిన అజ్మీర దూరి మంగళవారం ఐకేపీ సెంటర్‌లో వడ్లు ఆరపోస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కొని,అదే బైక్ పై అక్కడి నుండి పరారైనట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న సందర్భంలో బుధవారం నాచుపల్లి ఇటుక బట్టీల శివారులో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ తో సహా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా, వారే అట్టి దొంగతనానికి పాల్పడినట్లు నిర్దారించుకొని,వారిని అరెస్టు చేసి వారు mదొంగలించిన బంగారాన్ని, వారు ఉపయోగించిన బైక్ జగిత్యాల రూరల్ పరిధిలోని తిప్పన్నపేట గ్రామంలో దొంగిలించినట్లు గుర్తించి, కోరుట్ల కు చెందిన గణేష్,నిందితులను, బైక్ తో పాటు వారి మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకొని, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు మల్యాల సిఐ రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్, సిబ్బంది ఉన్నారు.