ప్రథమ చికిత్స కేంద్రాలపై దాడులు

03-11-2026 | 10:31pm

రాజాపూర్ నవంబర్ 3: మండలంలోని రంగారెడ్డి గూడా గ్రామంలో మంగళవారం రెండు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు(Dr. A. Srinivasulu) ఆకస్మికంగా తనిఖీ చేసి కనీస ఆరోగ్య సూత్రాలు పాటించని రెండు ప్రథమ చికిత్స కేంద్రాలను క్లోజ్ చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాలలో నిబంధనలకు విరుద్ధంగా హై యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ అనుమతి లేకుండా మందుల నిలువలను గుర్తించారు.

ప్రథమ చికిత్స కేంద్రాలలో వాడిన చిరంజీలు, సెలైన్ బాటిల్స్ ను రోజుల తరబడి నిల్వ చేయడం గుర్తించారు.వీటిని సైంటిఫిక్ లో డిస్పోజల్ చేయాల్సి ఉంది. కనీస ఆరోగ్య సూత్రాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలాతో చెలగాటమాడుతున్న రెండు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను మూసి వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకాంత్ నోడల అధికారి, హనుమంతు హెల్త్ ఎడుకేటర్, సిద్ధిక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు