గుర్తుతెలియని దుండగుల దుశ్చర్య, రైతు పొలం ధ్వంసం

04-10-2026 | 05:39pm

పంటను నాశనం చేసిన దుండగులు..ఆవేదనలో రైతు

ధర్మపురి,అక్టోబర్4(విజయక్రాంతి): గుర్తుతెలియని దుండగులు మందు కొట్టి పంటను నాశనం చేయడంతో వెల్గటూర్ మండలం(Velgatur Mandal) జగదేవ్ పేట బద్ధం రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పొలంలోకి ప్రవేశించి పంటపై మందు పిచికారీ(Spraying pesticides on the crop) చేసి పూర్తిగా నాశనం చేసినట్లు రైతు ఆరోపించాడు.

పంట కోసం పెట్టిన పెట్టుబడులు మొత్తం వృథా కావడంతో పాటు కుటుంబ పోషణకు ఆధారమైన పంట దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.తన పొలాన్ని నాశనం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, జరిగిన నష్టానికి తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతు అధికారులను కోరాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు