రెండు బైకులు ఢీ.. యువకుడికి గాయాలు

19-11-2026 | 11:55pm

కోనరావుపేట(విజయక్రాంతి): సిరిసిల్ల నుంచి కోనరావుపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గురువారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.మార్గమధ్యలోని నిజామాబాద్ కమాన్ వద్ద ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా వెనక్కి తిరగడంతో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జి. అరుణ్ (27) తలకు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సాయికృష్ణ, నవీన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు