ఆ పసిపిల్లలు చేసిన పాపమేంటి..?

28-11-2026 | 01:53pm

షాద్‌నగర్, నవంబర్ 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కందెన చెన్నయ్య దంపతుల మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్న నీటి సంపులో దూకింది.

ఈ ఘటనలో ముగ్గురు కూతుళ్లు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. స్థానికులు గుర్తించి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిసింది. పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు (Investigation) అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

మరిన్ని వార్తలు