వికారాబాద్‌లో ఘోర విషాదం

03-10-2026 | 11:43am

ప్రైవేటు బస్సు బోల్తా నలుగురు మృతి 

వికారాబాద్, అక్టోబర్ 3: వికారాబాద్ జిల్లా(Vikarabad district) అనంతగిరి ఘాట్ రోడ్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా(Private Bus Accident) పడటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి పోతే దారురు మండలం చింతకుంట గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో వారి అంత్యక్రియలకు హైదరాబాద్ నుండి ప్రైవేటు బస్సులో వచ్చారు.  ఘాట్ రోడ్డు దిగుతున్న సమయంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. క్షతగ్రతలను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

మరిన్ని వార్తలు