రూ.52 వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి
- రూ.38వేల కోట్లతో ‘మెట్రో ఫేజ్-2’
- భాగ్యనగరి ప్రగతికి కాంగ్రెస్ బాసట
- బీఆర్ఎస్ చేసిందేమీ లేదు
- కామన్ పాస్‌తో ప్రయాణం సులువు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఆవిష్కరణ
- మంత్రులు పొన్నం, వివేక్, అజారుద్దీన్ హాజరు
హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర(Hyderabad city) భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణం గా మౌలిక వసతుల విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. ప్రస్తు తం రూ.52,000 కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని, అందుకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నా యని వెల్లడించారు. అప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ ప్రగతికి బాసటగా నిలిచింది కాంగ్రెస్సేనని, బీఆర్ఎస్ పదేళ్లలో ప్రచా రం తప్పా చేసిందేమీ లేదని విమర్శించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC), హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) సంయుక్తంగా రూపొందించిన ‘ఆర్టీసీ- మెట్రో కామన్ పాస్‘ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అజారుద్దీన్‌తో కలిసి డిప్యూ టీ సీఎం ఆవిష్కరించారు. అలాగే ఆటో ఛార్జీల సవరణ జీఓను విడుదల చేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కేవలం హెచ్ఎండీఏ పరిధిలోనే రూ.35,000 కోట్ల తో ఫ్లైఓవర్లు, వంతెనలు, రేడియల్ రోడ్ల ని ర్మాణాలు జరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ మంచినీటి ప్రాజెక్టులు, అండర్‌పాస్‌ల పనులతో కలిపి మొత్తం రూ.52 వే ల కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రూ.38,000 కోట్ల అం చనా వ్యయంతో 122 కిలోమీటర్ల మేర మె ట్రో ఫేజ్--2 ప్రాజెక్టును విస్తరిస్తున్నట్లు తెలిపారు. రూ.30,627 కోట్లతో 362 కిలో మీటర్ల మేర ట్రిపుల్ఆర్ నిర్మాణం, ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్లను అనుసంధానించేలా 21 రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తు న్నామని భట్టి వెల్లడించారు.
కీలక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే..
కీలక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో చేపట్టినవేనని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు. మూసీ శుద్ధి, ఈ బస్సులు, భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి, మంజీరా జలాలు, ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, బెల్, ఈసీఐఎ ల్, డీఆర్డీఓ, బీడీఎల్, హెచ్‌సీయూ, ఐఐఐటీ వంటి కీలక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని వివరించారు.
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు: మంత్రి పొన్నం
ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక సం క్షేమ బోర్డు ఏర్పాటు చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ అందించడానికి ఆర్టీసీ, మెట్రో, ఆటో వ్యవస్థలను అనుసంధానిస్తున్నామని తెలిపారు. ప్రజలపై భారం పడకుండా, డ్రైవర్లకు న్యా యం జరిగేలా ఆటో ఛార్జీలను సవరించినట్లు చెప్పారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతినెలా ఇచ్చే రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.50 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు.
ప్రజారవాణా ఏకీకరణలో కీలక అడుగు
- కామన్ పాస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ప్రజారవాణా వ్యవస్థలను సమ న్వయపరిచి, ఏకీకరణ చేయడంలో కీలక అడుగు వేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ప్రజార వాణాను మరింత సులభతరం చేసేలా ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి కామన్ పాస్ శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువ చ్చామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో కామన్ పాస్‌లు జారీ చేస్తారని పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా సీఎం ప్రకటిం చారు. కామన్ పాస్ ద్వారా 25 లక్షలకు పైగా బస్సు ప్రయాణికులకు, 4.5లక్షలకు పైగా మెట్రో ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని ప్రయాణికులకు చివరి కిలో మీటరు వరకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే కామన్ పాస్ విధానం తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.