మూడు ముక్కలాటకు బ్రేక్..ఆరుగురి అరెస్ట్!
పెద్దపల్లి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని భూమ్నగర్లో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్(TASK FORCE) పోలీసులు దాడి చేశారు. డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కలాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ బి. శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్ఐ దీకొండ రమేష్, టాస్క్ఫోర్స్ సిబ్బంది, పెద్దపల్లి టౌన్ పోలీసులు సంయుక్తంగా శుక్రవారం భూమ్నగర్లో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 52 ప్లేయింగ్ కార్డులు(Playing Cards), రూ.28,120 నగదు, 7 సెల్ఫోన్లు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.