సిక్సర్లతో పాక్ బౌలర్లకు చుక్కలు
03-10-2026 | 11:07am
ఏషియన్ గేమ్స్(Asian Games) ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టారు. కేవలం 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి పాక్ బౌలర్లను ఉతికారేశారు. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు(Sixes), 3 ఫోర్లు ఉన్నాయి.
ఈ దూకుడైన ఇన్నింగ్స్‌తో అభిషేక్ ఈ ఏడాది టీ20ల్లో 100 సిక్సర్ల(T20 Sixes) మైలురాయిని అందుకున్నారు. గతేడాది 108 సిక్సర్లు బాదిన అభిషేక్.. ఈసారి ఆ మార్క్‌ను కూడా అధిగమించేలా దూసుకెళ్తున్నారు. ఫైనల్‌లో అతడి మెరుపు బ్యాటింగ్‌తో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.