ప్రజల మనిషి ఇక లేరు
మహమ్మదాబాద్, అక్టోబర్ 3(విజయక్రాంతి): మండల పరిధిలోని మంగంపేట తండాకు చెందిన సీనియర్ కార్యకర్త ఎం. లింగ్యా నాయక్ మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.. లింగ్యా నాయక్ పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. లింగ్యా నాయక్ ప్రజల మనిషిగా(Peoples Man), గిరిజనుల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లింగ్యా నాయక్ కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అనంతరం గాదిర్యాల మాజీ సర్పంచ్ వెంకట్ రాంరెడ్డి, గుర్రం రాజేశ్వర్, మంగంపేట తండా గ్రామ సర్పంచ్ సభావత్ గోపాల్, గీతాపాండు తదితరులు లింగ్యా నాయక్ పార్థివదేహానికి నివాళులర్పించారు. గ్రామస్థులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.