రిక్వెస్ట్‌కు నో చెప్పండి.. సేఫ్‌గా ఉండండి!

03-10-2026 | 11:23am

సోషల్ మీడియా(Social Media)లో కొత్త పరిచయం.. కాసేపటికే ఫ్రెండ్‌షిప్.. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు షేర్ చేయడం.. ఇక్కడే అసలు ముప్పు మొదలవుతోంది. ముఖ్యంగా 16 నుంచి 18 ఏళ్ల టీనేజర్లను టార్గెట్(Target) చేస్తూ కొందరు నకిలీ ఖాతాలతో పరిచయం పెంచుకుంటున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా నమ్మకం కలిగించి.. ఆ తర్వాత వ్యక్తిగత ఫొటోలు, వివరాలు సేకరించి.. వాటిని అడ్డుపెట్టుకుని బెదిరింపులు(Threats), డబ్బుల డిమాండ్లు చేసే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

అందుకే తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు(Friend Requests) అంగీకరించకపోవడం.. వ్యక్తిగత ఫొటోలు, వివరాలు షేర్ చేయకపోవడమే సురక్షితం. అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే స్పందించకుండా వెంటనే బ్లాక్(Block) చేసి రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే ఏదైనా షేర్ చేసి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. చాట్స్, స్క్రీన్‌షాట్లు, ఖాతా వివరాలను భద్రపరచి తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దలకు చెప్పాలి. అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి. సోషల్ మీడియాలో ఒక్క చిన్న జాగ్రత్త.. పెద్ద సమస్యను దూరం చేయొచ్చు!

మరిన్ని వార్తలు