గాంధీయిజమే మార్గదర్శకం
- అహింస, సత్యాగ్రహం, సమానత్వం మహాత్ముడి
- గాడ్సే భావజాలాన్ని ప్రజలు తిరస్కరించాలి
- మహాత్ముడి స్ఫూర్తితో ప్రజాపాలన
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఎల్‌బీ స్టేడియంలో ఘనంగా గాంధీ జయంతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 2(విజయక్రాంతి): అహింస, సత్యాగ్రహం, సమా నత్వం, సామాజిక న్యాయం(Non-violence, Satyagraha, Equality, Social Justice) వంటి మహాత్మాగాంధీ ఆలోచనలే ప్రపంచానికి మార్గదర్శకం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ చూపిన మార్గంలో అసమానతలు, వివక్షత లేని సమాజాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ జయం తి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, టీపీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు.
గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే(Nathuram Godse) భావజాలాన్ని సమర్థించే ధోరణులు దేశం లో కనిపించడం బాధాకరమని, అటువంటి సంస్కృతిని ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో(Freedom Struggle) గాంధీ నాయకత్వం, సత్యాగ్రహం, అహింస సిద్ధాంతాలు అత్యంత కీలకపాత్ర పొషించాయన్నా రు. స్వాతంత్రోద్యమంతో సంబంధం లేనివారు, గాంధీతో కలిసి నడవని వ్యక్తులు.. నేడు చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దక్షిణాఫ్రికాలో ఎదు రైన అవమానం గాంధీ జీవితంలో కీలక మలుపుగా మారిందని, ప్రజల కోసం పో రాడాలనే సంకల్పాన్ని మరింత బలపరిచిందన్నారు.
భారతదేశానికి తిరిగి వచ్చి రైతులు, పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై ఉద్యమాలకు నాయకత్వం వహించారని వివరిం చారు. చంపారన్ సత్యాగ్రహం నుంచి దండి సత్యాగ్రహం వరకు గాంధీజీ సామాన్య ప్రజల సమస్యలను ఉద్యమాలకు కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు. గుప్పెడు ఉప్పుతో, చిన్న నూలుపోగుతో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సవాల్ విసిరి భారతదేశ ప్రజల శక్తిని ప్రపంచానికి చాటారని తెలిపారు. స్వాతం త్య్రం కోసం పోరాడుతూనే సామాజిక అసమానతలు, అంటరానితనానికి వ్యతిరేకంగా నూ గాంధీజీ ఉద్యమించారని వివరించారు.
హిందూముస్లిం ఐక్యతను బలోపేతం చేసి స్వాతంత్య్రో ద్యమాన్ని విస్తృత ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ తదితర జాతీయ నాయకులు వేసిన పునాదుల వల్లే దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం వంటి రంగాల్లో పురోగతి సాధ్యమైందని భట్టి పేర్కొన్నారు. గాంధీజీ ఆలోచనల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.
ప్రజలందరికీ సమాన అవకాశాలు, విద్య, సామాజి క గౌరవం కల్పించడమే లక్ష్యమని, అందుకు అనుగుణంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటె డ్ రెసిడెన్షియల్ స్కూళ్ల’ ఏర్పాటుకు శ్రీకా రం చుట్టినట్టు తె పారు. కులం, మతం, వ ర్గం అనే భేదాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాల పిల్లలు కలిసి చదువుకునేలా పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గాంధీ వేషధారణ చిన్నారులు డిప్యూటీ సీఎం కు స్వాగతం పలికారు. వివిధ రకాల స్టాల్స్ భట్టి పరిశీలించారు.
గాంధేయవాదంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ : మహేష్‌కుమార్ గౌడ్
గాంధీ మార్గం దేశానికి శ్రీరామరక్ష అని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ మా ర్గాన్ని అనుసరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా, ప్రజాకేంద్రంగా కొనసాగుతుందన్నారు. సత్యం, అహింస, శాంతి, సహనం వంటి గాంధేయ విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీ జయంతి యావత్ ప్రపంచా నికి పండుగని, శాంతిని కోరుకునే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన రోజని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాక ర్, అజారుద్దీన్, వివేక్ వెంకట్‌స్వామి, ప్రభు త్వ సలహాదారు వి.హనుమంతరావు, ఫయీ మ్ ఖురేషీ, అంజన్‌కుమార్ యాదవ్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కొత్త శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ గాం ధారి ప్రభాకర్, సెక్రటరీ యానా ల ప్రభాకర్‌రెడ్డి, కల్చరల్ కన్వీనర్ అభినయ శ్రీనివాస్, గోపాల్‌జీ తదితరులు పాల్గొన్నారు.