మంత్రుల మెట్రో జర్నీ..మధ్యలోనే ఆగిన ఎస్కలేటర్!
హైదరాబాద్(Hyderabad)లోని బేగంపేట మెట్రో స్టేషన్లో మంత్రులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్(RTC-Metro Common Pass)తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో ప్రయాణించారు.బేగంపేట మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్(Escalator)పై ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో.. ఎస్కలేటర్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఎస్కలేటర్‌పై నుంచి నడుచుకుంటూ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్నారు.అనంతరం మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రులు.. తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. మెట్రో ప్రయాణంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.