మృత్యుప్రయాణం.. క్షణాల్లో ప్రాణాలు మాయం!
03-10-2026 | 08:31am
యూపీ(Uttar Pradesh)లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తున్న వోల్వో బస్సును.. ఎదురుగా వచ్చిన ట్రక్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగంతో పాటు ఎడమ వైపు పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు(Investigation) చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.